: కొన్ని చానెళ్లు, పేపర్లు ఫోర్ స్టార్ రేటింగులు ఇచ్చాయి: ‘శాతకర్ణి’ సినిమాపై దర్శకుడు క్రిష్
‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రానికి కొన్ని చానెళ్లు, పేపర్లు ఫోర్ స్టార్ రేటింగులు ఇచ్చాయని, ఎంతో బాగుందని అందరూ మెచ్చుకున్నారని ఆ సినిమా దర్శకుడు క్రిష్ అన్నారు. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ... ఈ సినిమా విజువల్ వండర్ గురించి పలువురు ప్రముఖులు ప్రశంసించారని, ఈ సినిమా కథ, రచన అన్ని అంశాలను మెచ్చుకుంటున్నారని చెప్పారు. గౌతమి పుత్ర శాతకర్ణి ధీరత్వాన్ని, ఆయనకే సొంతమైన పలు అంశాలని తెరకెక్కించామని అన్నారు. ఈ సినిమా కోసం తాను చేసిన తపన ఫలితాన్ని తన జననికి, జన్మభూమికి అంకితమిస్తున్నానని అన్నారు.