supreme court: కేంద్రం, ట్రాయ్, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ల‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

వినియోగ‌దారుల డేటా ప్రైవ‌సీకి సంబంధించి ఇటీవ‌ల దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్ర స‌ర్కారుతో పాటు ట్రాయ్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ సంస్థలకు నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా త‌మ‌కు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఫేస్‌బుక్‌, వాట్స‌ప్‌లో ఉన్న డేటాకు రక్షణ లేద‌ని, అది యూజ‌ర్ల ప్రైవసీని దెబ్బతీస్తుంద‌ని పిటిషనర్ కర్మన్యసింగ్ తరుపు న్యాయవాది హరీశ్‌సాల్వే కోర్టుకి తెలిపారు.
supreme court

More Telugu News