: రూ. 99కే ఎయిర్ ఆసియా విమాన ప్రయాణ టికెట్
ప్రైవేటు రంగ పౌరవిమానయాన సంస్థ ఎయిర్ ఆసియా ఇండియా ఒక వైపు ప్రయాణానికి రూ. 99 నుంచి మొదలుకొని టికెట్లను అందించనున్నట్టు ప్రకటించింది. రేపటి నుంచి 22 వరకూ బుక్ చేసుకునే టికెట్లపై మే 1 నుంచి ఫిబ్రవరి 6, 2018 వరకూ ప్రయాణ తేదీని నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. బెంగళూరు, చండీగఢ్, గోవా, గౌహతి, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్, కొచ్చి, న్యూఢిల్లీ, పుణె, వైజాగ్ తదితర గమ్యస్థానాలకు టికెట్లు కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఇక కౌలాలంపూర్, మలేషియా, బ్యాంకాక్ తదితర ప్రాంతాలకు రూ. 999 మొదలుకుని టికెట్లను పొందవచ్చని వెల్లడించింది. కాగా, ఎనిమిది ఎయిర్ బస్ ఏ 320 విమానాలతో ఎయిర్ ఆసియా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. విమానాల సంఖ్యను భవిష్యత్తులో మరింతగా పెంచనున్నామని సంస్థ తెలిపింది.