: హీరో నాని చెబుతున్న కొత్త అర్ధం... అమ్మాయి పొద్దున్నే చదువుతుంటే మార్చి, అబ్బాయి చదువుతుంటే సెప్టెంబర్ అట!
హీరో నాని, కీర్తి సురేశ్ నటించిన తాజా చిత్రం 'నేను లోకల్' థియేటరికల్ ట్రైలర్ విడుదలై, సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. అటు యాక్షన్, ఇటు కామెడీ, పంచ్ డైలాగులు ఈ ట్రైలర్ లో పేలాయి. "ఒక అమ్మాయి తెల్లవారుజామున 4 గంటలకు చదువుకుంటోందంటే.. అది మార్చి అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్ షిప్ బిట్విన్ మార్చి అండ్ సెప్టెంబర్ షుడ్ బి లైక్ ఎ ఫిష్...’’ అంటూ నాని చెప్పిన డైలాగ్ అలరిస్తోంది.
ఆపై ‘వీడు మాములోడు కాదే. జండూబామ్ కు కూడా తలనొప్పి తెప్పించే రకం’ అంటూ నాని క్యారెక్టర్ స్వభావాన్ని చెప్పే తండ్రి పాత్ర, ‘పరిగెత్తి, పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు. ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు’ అంటూ ఓ యాక్షన్ డైలాగ్ ఇందులో వున్నాయి. ట్రైలర్ డైలాగులు పేలుతుండటంతో, యూట్యూబ్ లో సైతం దీనికి మంచి హిట్స్ వస్తున్నాయి. నిన్న ఈ ట్రైలర్ విడుదల కాగా, ఇప్పటికే దాదాపు ఐదున్నర లక్షల మంది దీన్ని వీక్షించారు.