: ద‌ర్శ‌నమిచ్చిన మకరజ్యోతి... శరణుఘోషతో మార్మోగిపోయిన శబరిగిరులు


కేరళలోని అయ్యప్ప పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. మకరజ్యోతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. పొన్నాంబలమేడు నుంచి జ్యోతి దర్శనమివ్వగానే భక్తులు ఆనంద పరవశులయ్యారు. ‘స్వామియే శరణమయ్యప్ప’ అంటూ నినాదాలు చేస్తూ భక్తులు పులకించిపోయారు. తరువాత అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం వద్ద పోటెత్తారు. కేరళతో పాటు పలు రాష్ట్రాల నుంచి మకరజ్యోతిని చూడడానికి  భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతి ఏడాది లాగే భారీ సంఖ్యలో భక్తులు మాలలు ధరించి మకరజ్యోతి దర్శనం కోసం వచ్చారు.

  • Loading...

More Telugu News