fire accident: యాదగిరిగుట్టలో భారీ అగ్ని ప్రమాదం.. 20 గుడిసెలు దగ్ధం

షార్ట్‌సర్క్యూట్ కార‌ణంగా ఈ రోజు మ‌ధ్యాహ్నం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్క‌సారిగా మంట‌లు వ్యాపించ‌డంతో 20 గుడిసెలు దగ్ధమయ్యాయి. మంట‌లు వ్యాపించ‌డంతో గుడిసెలలో ఉన్న త‌మ‌ వస్తువులన్నీ కాలిపోయాయ‌ని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాము కట్టుబట్టలతో మాత్రమే గుడిసెల నుంచి బయటపడ్డామ‌ని అన్నారు. బాధితులంతా సన్‌షైన్ సంస్థలో పని చేస్తున్న కార్మికులని అగ్నిమాప‌క సిబ్బంది తెలిపారు. వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చామ‌ని చెప్పారు.
fire accident

More Telugu News