: సౌరవ్ గంగూలీని చంపేస్తానని బెదిరించింది పేపర్ బాయ్... అరెస్ట్
కోల్ కతా ప్రిన్స్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని హత్య చేస్తానని లేఖ రాసింది పేపర్ బాయ్ నిర్మల్యా అని గుర్తించిన పశ్చిమ బెంగాల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతనికి గార్బెటా ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధి ఆశిష్ చక్రవర్తితో విభేదాలున్నాయని, గంగూలీని మిడ్నాపూర్ ప్రాంతానికి ఆశిష్ పిలిపిస్తున్నాడని తెలసుకుని, గంగూలీ వస్తే, ఆశిష్ పరపతి పెరుగుతుందన్న ఆలోచనతో, ఆయన్ను ఆపేందుకు ఈ పని చేశాడని వెస్ట్ మిడ్నాపూర్ ఎస్పీ భారతీ ఘోష్ వెల్లడించారు.
కాగా, జనవరి 7న కోల్ కతాలో గంగూలీ నివసించే మెహలా రెసిడెన్సీకి ఈ లేఖ రాగా, ఆపై గంగూలీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 19న విద్యాసాగర్ యూనివర్శిటీలో ఏర్పాటు కానున్న కార్యక్రమంలో గంగూలీ పాల్గొంటే చంపేస్తానని, ఆయన తల్లి నిరూపా పేరిట ఈ లేఖ వచ్చింది. "ఈ కార్యక్రమానికి వచ్చే ధైర్యాన్ని మీ కుమారుడు చేస్తే, అతన్నిక మళ్లీ చూడలేరు" అని హెచ్చరిస్తున్నట్టు ఇందులో ఉంది.