: హిమాచల్‌ప్రదేశ్‌లోని హిల్ స్టేషన్‌ వద్ద నిట్ విద్యార్థుల అదృశ్యం

కాలేజీ రికార్డుల్లో ఇంటికి వెళుతున్నామ‌ని రాసి బ‌య‌లుదేరిన యూపీలోని హమీర్‌పూర్ నిట్ కు చెందిన‌ న‌లుగురు విద్యార్థులు హిమాచల్‌ప్రదేశ్‌లోని హిల్ స్టేషన్‌కు వెళ్లి అక్క‌డ అదృశ్య‌మ‌య్యారు. స‌ద‌రు విద్యార్థులు నవనీత్, అక్షయ్ లుగా పోలీసులు గుర్తించారు. వారితో పాటు వారి ఇద్దరి స్నేహితులు వారం రోజుల క్రితం టూరిజం నిమిత్తం అక్క‌డ‌కు వెళ్లిన‌ట్లు అధికారులు తెలుసుకున్నారు. త‌మ‌ పర్యటనలో భాగంగా స‌ద‌రు విద్యార్థులు మండి జిల్లా జంజేహలీలోని శికారీ లోయ ప్రాంతంలోకి వెళ్లిన‌ట్లు గుర్తించారు.
 
ఈ నెల 6న స‌ద‌రు విద్యార్థులు లోయ ప్రాంతాన్ని చూడటానికి వెళ్లార‌ని, అప్ప‌టి నుంచి వారు క‌నిపించ‌కుండా పోయార‌ని తెలుస్తోంది. వారి ఆచూకీని తెలుసుకునేందుకు ప్రత్యేక సహాయక సిబ్బందిని పంపించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో మంచు తాకిడి అధికంగా ఉండటంతో సహాయక చ‌ర్య‌ల‌కు ఆటంకం ఏర్ప‌డుతోంద‌ని, విద్యార్థుల కోసం రేపటి నుంచి ఆపరేషన్‌ను కొనసాగిస్తామ‌ని చెప్పారు.

More Telugu News