: ఒక పాటలో జయసుధ బుగ్గపై కొట్టాల్సి వచ్చినప్పుడు భయపడ్డా: ఆర్.నారాయణమూర్తి

ఒక పాటలో జయసుధ బుగ్గపై  కొట్టాల్సి వచ్చినప్పుడు తాను చాలా భయపడ్డానని ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. నారాయణమూర్తి నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఒక న్యూస్ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ, ‘ఉందా.. ఉందా ఙ్ఞాపకం ఉందా’ అనే పాటను సహజనటి జయసుధ, తన మధ్య చిత్రీకరించారని, ఆ పాట కు సంబంధించిన ఒక సన్నివేశంలో ఆమె బుగ్గపై తాను సుతిమెత్తగా కొట్టాల్సిన సందర్భంలో తాను చాలా భయపడ్డానని అన్నారు. ఎందుకంటే, పొరపాటున తన చేయి గట్టిగా తగిలితే ఆమెకు కష్టమవుతుందని భావించానని, ఈ విషయమై తాను చాలా ఫీలయ్యానని అన్నారు. అయితే, ‘అదేమి పట్టించుకోకు, హుషారుగా చేసేయ్’ అని జయసుధ చెప్పారని నారాయణమూర్తి అన్నారు. 

More Telugu News