: కొత్త జెర్సీలో మెరవనున్న టీమిండియా ఆటగాళ్లు!


మరో రెండు రోజుల్లో ఇంగ్లండ్ తో జరిగే వన్డే సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో మెరవనున్నారు. ఇప్పుడున్న జెర్సీలో కొన్ని మార్పులను చేసింది నైకీ సంస్థ. టీమిండియాకు నైకీ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నూతన జెర్సీని బీసీసీఐతో కలసి నైకీ గురువారంనాడు ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ధోనీ, కోహ్లీ, రహానే, అశ్విన్ లతో పాటు మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ లు హాజరయ్యారు. ఈ జెర్సీలో 4డీ క్విక్ నెస్, జీరో డిస్ట్రాక్షన్, ట్యూన్డ్ బ్రీతబిలిటీ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఈ జెర్సీ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని నైకీ తెలిపింది. 

  • Loading...

More Telugu News