: డోపింగ్‌ టెస్టుల్లో పట్టుబడ్డ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేతలు!


2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణపతకాలు సాధించిన కావా లీ (75 కేజీల విభాగం), చెన్‌ గ్జియాగ్జియ (48 కేజీల విభాగం), లియూ చున్‌హనాగ్ (69 కేజీల విభాగం) లు డోపింగ్‌ టెస్టుల్లో పట్టుబడ్డారు. దీంతో ఈ ముగ్గురిపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అనర్హత వేటు వేసింది. వారు సాధించిన ఆ పతకాలను వెనక్కి తీసుకుంది. ఈ ముగ్గురు అథ్లెట్లు నిషేధిత జీహెచ్‌ఆర్‌పీ-2 డ్రగ్‌ను తీసుకున్నట్లు వీరి డోప్‌ పరీక్షలను పునర్విశ్లేషించగా స్ప‌ష్ట‌మైంది. దీంతో చైనాపై అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ ఒక సంవత్సరం నిషేధం విధించనుంది. ఈ ముగ్గురు అథ్లెట్ల‌తో పాటు అదే ఒలింపిక్స్‌ షాట్‌పుట్‌లో కాంస్య పతకం సాధించిన బెలారస్‌కు చెందిన నడ్జేయ అనే అథ్లెట్ కూడా డోప్‌ టెస్టుల్లో ప‌ట్టుబ‌డింది.

  • Loading...

More Telugu News