: 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఫ్రీ షో... బాలయ్య అభిమానులకు సంక్రాంతి కానుక


ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని బాలయ్య అభిమానులకు శుభవార్త. ఎర్రగొండపాలెంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాను ఈ ఉదయం 11 గంటలకు ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. జిల్లాపరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత డాక్టర్ మన్నె రవీంద్ర ఈ విషయాన్ని తెలిపారు. లక్ష్మీ వెంకటేశ్వర థియేటర్ లో ఉదయం 11 గంటలకు ఈ ఫ్రీ షో ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ఫ్రీ షో కోసం థియేటర్ కు రూ. 25 వేలు చెల్లించామని తెలిపారు. బాలయ్య అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో వస్తే... మరో ఆటను కూడా ఫ్రీగా ప్రదర్శిస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News