: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన భోగి సంబరాలు..!

తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు మొదలయ్యాయి. ప్రజలు తెల్లవారుజామునే నిద్రలేచి సంప్రదాయ బద్ధంగా ఒంటికి నలుగు పెట్టుకుని, తలంటు స్నానమాచరించారు. అనంతరం లోగిళ్లలో భోగి మంటలు వేసి చలిని పారదోలారు. మహిళలు వాకిళ్లను అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దారు. చిన్నారులు కేరింతలతో భోగి మంటల ముందు కూర్చుని నెల రోజులుగా తయారుచేసుకున్న పిడకలను అందులో వేసి చలికాచుకుంటున్నారు. ఏపీలో జరుగుతున్న వేడుకల్లో పలు ప్రాంతాల్లో మంత్రులు సైతం పాల్గొన్నారు. తెలంగాణలో సంబరాలు మిన్నంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పతంగులతో మిద్దెలపైకి చేరుకుంటున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

More Telugu News