: టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్ సక్సెస్ అవుతారు: ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి


టాటా సన్స్ కొత్త  చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకంపై ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఆ సంస్థకు చైర్మన్ గా చంద్రశేఖరన్ సక్సెస్ అవుతారని, ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. చంద్రశేఖరన్ కు మంచి విజన్ ఉందని, ఆయనను ఎంపిక చేయడం  ఐటీ రంగానికి ఎంతో లాభదాయకమని అన్నారు. కాగా, చంద్రశేఖరన్ ఎంపికపై  ప్రముఖ సంస్థలు విప్రో, బయోకాన్, టైటాన్ ఎండీలు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News