: ధోనీ నిర్ణయంపై స్పందించిన హెడ్ కోచ్ కుంబ్లే
అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తాను తప్పుకున్నట్లు టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఈరోజు స్పందించారు. కెప్టెన్ గా ధోని అందించిన విజయాలు అపూర్వమైనవని, అతడు ఎంత విలువైన ఆటగాడో తమకు తెలుసని ప్రశంసించారు. విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయం అని ధోని భావించాడన్నారు. కోహ్లీకి ధోనీతో ఉన్న బంధం.. అతడు గొప్ప నాయకుడిగా ఎదిగేందుకు తోడ్పడుతుందని కుంబ్లే అభిప్రాయపడ్డారు.