: తమిళనాడు సీఎంకి పుష్పగుచ్చం ఇచ్చి స్వయంగా స్వాగతం పలికిన చంద్రబాబు
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి చంద్రబాబు నాయుడి దగ్గరకు బయలుదేరిన విషయం తెలిసిందే. తమ కార్యాలయానికి చేరుకున్న పన్నీర్ సెల్వంకు చంద్రబాబు నాయుడు పుష్పగుచ్చం ఇచ్చి స్వయంగా స్వాగతం పలికారు. చంద్రబాబుతో మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు కూడా ఉన్నారు. తమిళనాడుకు తెలుగు గంగ నీటి పంపిణీ అంశంపై చంద్రబాబుతో పన్నీర్ సెల్వం చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాజకీయ అంశాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.