: ఏపీపై మోదీ మమకారం.. బాబు సహకారం: వెంకయ్యనాయుడు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీపై మమకారం ఉందని, దీంతోపాటు, సీఎం చంద్రబాబు సహకారం కూడా తోడైందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో రన్ వే విస్తరణకు భూమి పూజ, విదేశీ టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం, వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, రవాణా రంగం అభివృద్ధితో చాలా ప్రయోజనాలు ఉన్నాయని, రవాణా రంగం అభివృద్ధితో పర్యాటక, వాణిజ్య విస్తరణ జరుగుతుందన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తొలి పునాది పోలవరం ప్రాజెక్టు అయితే, రెండోది గన్నవరం విమానాశ్రయ విస్తరణ అని అన్నారు. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలపై ఏపీ ఆధారపడి ఉందని, వ్యవసాయ ఆధారిత పంటల ప్రోత్సాహానికి రవాణా ఉపయోగపడుతుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.