: జల్లికట్టుపై స్వరం పెంచిన స్టాలిన్.. ప్రభుత్వంపై విమర్శలు!
తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుపై ప్రతిపక్ష డీఎంకే స్వరం పెంచింది. జల్లికట్టు అంశం సుప్రీంకోర్టులో ఉందనే సాకును చూపుతూ... ఏమీ చేయకుండా తప్పించుకునే ప్రయత్నాన్ని అన్నాడీఎంకే ప్రభుత్వం చేస్తోందని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ విమర్శించారు. తమిళనాడుకు వచ్చి చూస్తే కానీ... కేంద్ర ప్రభుత్వానికి పరిస్థితి అర్థం కాదని ఆయన అన్నారు. ఎలాంటి చిక్కులు లేని, న్యాయపరమైన కావేరీ జలాల విషయంలో కూడా కేంద్రం కల్పించుకోవడం లేదని మండిపడ్డారు. తమిళనాడుకు అత్యంత ముఖ్యమైన కావేరి జలాలు, జల్లికట్టు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.