: బాలయ్య గారూ, యూ ఆర్ లుకింగ్ అమేజింగ్... అమేజింగ్!: ఐమ్యాక్స్ వద్ద హీరోయిన్ శ్రియ సంతోషం
నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రోజు విడుదలయి అభిమానుల మంచి స్పందన అందుకున్నఅంశంపై నటి శ్రియ హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ కు బాలయ్యతో పాటు సినిమా దర్శకుడు క్రిష్, నటి శ్రియ వచ్చారు. ఈ సందర్భంగా శ్రియ మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ఈ సినిమా ఘన విజయానికి వచ్చిన క్రెడిట్ అంతా దర్శకుడు క్రిష్‌కే దక్కుతుందని చెప్పింది. ‘ఈ సినిమాలో బాలయ్య గారూ, యూ ఆర్ లుకింగ్ అమేజింగ్... అమేజింగ్.. అమేజింగ్’ అంటూ బాలకృష్ణను చూస్తూ శ్రియ వ్యాఖ్యానించింది. ఈ సినిమాలో శ్రియ కూడా ఎంతో బాగా నటించిందని ఈ సందర్భంగా క్రిష్ అన్నారు.