: మీకు తెలుసా? రాహుల్ ద్రవిడ్ రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు?: కేంద్ర మంత్రి విజయ్ గోయల్


టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పుట్టిన రోజు నేడు. ద్రవిడ్ పుట్టిన రోజును పురస్కరించుకుని క్రీడాకారులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఉత్సాహం చూపారు. అందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. క్రికెట్ లో నిజమైన జెంటిల్మన్ రాహుల్ ద్రవిడ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నారు. 'మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే... ఒక సందర్భంలో ద్రవిడ్ రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు' అన్నారు.

మహ్మద్ కైఫ్ ట్వీట్ చేస్తూ...సెల్ఫ్ లెస్ మెన్, లవబుల్ హ్యూమన్ బీయింగ్, అంతకంటే అతనిని ప్రేమించడానికి కారణం అతని పేరు రాహుల్ కావడం అంటూ ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ తన ట్విట్టర్ లో 'మేము ఎన్నో విజయాలు పంచుకున్నాము, అతనో పెద్ద సి అన్నాడు. సి అంటే కమిట్ మెంట్, క్లాస్, కన్సిస్టెన్సీ, కేర్... అలాంటి వ్యక్తితో కలిసి ఆడడం గర్వించదగ్గ విషయం' అని పేర్కొన్నాడు. కెప్టెన్ కోహ్లీ.. 'వర్థమాన క్రికెటర్లను తయారు చేస్తున్నందుకు ధన్యవాదాలు అన్నా... పుట్టినరోజు శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు. 

  • Loading...

More Telugu News