: మరింతగా పెరిగిన బంగారం, వెండి ధరలు !
బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా వివాహ వేడుకల నేపథ్యంలో బంగారం వర్తకుల నుంచి కొనుగోళ్లు బాగా పెరగడంతో బంగారం ధర పెరిగింది. స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ.70 పెరిగి 29,100కు చేరింది. అదేవిధంగా, పరిశ్రమలు, నాణేల తయారీదారుల డిమాండ్ కారణంగా వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.550 పెరిగి 41,330 కు చేరింది. కాగా, ప్రపంచ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 0.29 శాతం పెరిగి 1190.79 డాలర్లకు, వెండి ధర 0.39 శాతం పెరిగి 16.82 డాలర్లకు చేరాయి.