: రాఖీ సావంత్ కు సంబంధాలు చూస్తున్నా: సోఫియా హయాత్


బాలీవుడ్ లో శృంగార తారగా పేరొందిన సోఫియా హయాత్ మరో బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్ కు సంబంధాలు చూస్తున్నట్టు తెలిపింది. ఆ మధ్య తాను సన్యాసిగా మారిపోయానని ప్రకటించిన సోఫియా హయాత్ చాలా కాలం తరువాత మరో శృంగార తార వివాహంపై స్పందించడం ఆసక్తి రేపుతోంది. రాఖీ సావంత్ ఈ ఏడాది వివాహం చేసుకోవాలని తాను ఆశిస్తున్నానని చెప్పింది. రాఖీ సావంత్ చాలా కష్టపడి పని చేస్తుందని, బయటకు సెక్స్ సింబల్ లా కనిపించినా, లోపల రుషి లాంటిదని ఆమె అభిప్రాయపడింది. పారే నదిలాంటి రాఖీ సావంత్ ఈ ఏడాదైనా పెళ్లి చేసుకోవాలని సూచించింది. కాగా, గతంలో 'రాకీ కా స్వయంవర్' అనే రియాలిటీ షోలో ఒక వ్యక్తిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డ రాఖీ...మనస్పర్థల కారణంగా అతనితో విడిపోయిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News