: ఇంగ్లండ్ తో ఇండియా-ఏ ఓటమికి ద్రావిడ్ కారణమా?
నిన్న ఇంగ్లండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఇండియా-ఏ జట్టు ఓడిపోవడానికి క్రికెట్ దిగ్గజం ద్రావిడ్ కారణమా? మ్యాచ్ అనంతరం ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ శ్యామ్ బిల్లింగ్స్ చేసిన వ్యాఖ్యలు వింటే నిజమే అనిపిస్తుంది. ఛేజింగ్ లో బిల్లింగ్స్ 85 బంతుల్లో 93 పరుగులు చేసి, తన జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తన ఆట తీరుకు ద్రావిడే కారణమని చెప్పాడు. గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు మెంటార్ గా ద్రావిడ్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తన బ్యాటింగ్ టెక్నిక్ ను ద్రావిడ్ మెరుగుపరిచాడని బిల్లింగ్స్ తెలిపాడు.
ద్రావిడ్ సలహాతో ఫుట్ వర్క్ సమస్యను అధిగమించానని... స్పిన్నర్లను ఎదుర్కోవడంలో పట్టు సాధించానని చెప్పాడు. ఈ క్రెడిట్ అంతా ద్రావిడ్ దే అని చెప్పాడు. ఇప్పుడు అర్థమయింది కదా... మన ఓటమికి పరోక్షంగా ద్రావిడే కారణమని!