: తైవాన్ సముద్ర జలాల్లో చైనా విమాన వాహక నౌక.. యుద్ధ విమానాలు మోహరించిన తైవాన్!


తమ సముద్ర జలాల్లోకి దూసుకొచ్చిన చైనా విమాన వాహక నౌకను నిలువరించేందుకు తైవాన్ యుద్ధ విమానాలను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే తైవాన్, చైనాల మధ్య సంబంధాలు అంత బాగా లేవన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చైనా కొనుగోలు చేసి తెచ్చుకున్న విమాన వాహక యుద్ధ నౌక దక్షిణ చైనా సముద్రంలో విన్యాసాలు చేసి, తైవాన్ జలాల్లోకి వచ్చిందని, ఆ వెంటనే తాము యుద్ధ నౌకను, విమానాలను సిద్ధం చేయాల్సి వచ్చిందని తైవాన్ ప్రతినిధి చావ్ చుంగ్ చీ వెల్లడించారు. తమ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో తమకు బాగా తెలుసునని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాగా, ఈ చైనా నౌక విన్యాసాల అనంతరం తన తిరుగు ప్రయాణంలో తైవాన్ సమీపానికి వచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News