: నా కుమారుడిని కూడా ఆర్మీలో చేర్పించాలనుకున్నా... కానీ, చేరనివ్వను: జవాన్ తేజ్ బహదూర్ భార్య


తన కుమారుడిని కూడా సైన్యంలో చేర్పించాలనుకున్నానని... కానీ, చేరనివ్వనని బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ భార్య తెలిపింది. జవాన్లకు దారుణమైన ఆహారాన్ని అందిస్తున్నారన్న విషయాన్ని తేజ్ బహదూర్ ఓ వీడియో ద్వారా ప్రపంచానికి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. తేజ్ బహదూర్ మాటల్లో వాస్తవం ఎంతుంది? అనే విషయాన్ని పక్కనపెడితే... తన భర్త వీడియోను చూసి, ఆమె మాత్రం చలించిపోయింది.

తమకు కేవలం ఓ పరాటా, చాయ్ మాత్రమే బ్రేక్ ఫాస్ట్ గా ఇస్తారని.. అందులో కూరగాయలు కూడా ఉండవని, ఒక్కోసారి ఖాళీ కడుపుతోనే పడుకోవాల్సి ఉంటుందని వీడియోలో తేజ్ బహదూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తేజ్ బహదూర్ తాగుబోతని, అతను అసత్య ప్రచారాలు చేస్తున్నాడని బీఎస్ఎఫ్ అధికారులు కొట్టిపడేశారు.

  • Loading...

More Telugu News