: హెచ్ఐవీ ఇప్పటిది కాదు.. 50 కోట్ల ఏళ్ల క్రితమే ఉంది.. తాజా అధ్యయనంలో వెల్లడి
హెచ్ఐవీ.. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ ఈ నాటిది కాదని, 50 కోట్ల ఏళ్ల క్రితమే ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. హ్యూమన్ ఇమ్యూనో డెఫిసియన్సీ వైరస్ జంతువుల శరీరాలను ఆవాసంగా చేసుకుని మనుగడ సాగిస్తుందని లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ మొండి వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు తాజా అధ్యయనం ఎంతగానో ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఒక శరీరం నుంచి మరో శరీరానికి వ్యాప్తి చెందే ఈ వైరస్ కొత్త వ్యాధులను తీసుకొస్తుందని యూనివర్సిటీకి చెందిన కట్జౌరకిస్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ వైరస్ ను నియంత్రించడం తప్పితే శాశ్వతంగా నివారించే మందులు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన ఈ విషయంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని అధ్యయనకారులు ఆశాభావం వ్యక్తం చేశారు.