: ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన మొబిక్విక్.. పెట్రోలు బంకులు, ఎల్పీజీ చెల్లింపులకు సర్‌చార్జ్ లేదు!
దేశీయ మొబైల్ వ్యాలెట్ మొబిక్విక్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. తమ మొబైల్ వ్యాలెట్‌ను ఉపయోగించి పెట్రోలు బంకులు, వంట గ్యాస్‌కు చెల్లింపులు చేస్తే సర్‌చార్జీలు వసూలు చేయబోమని పేర్కొంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ ఆఫర్‌ను ప్రకటించినట్టు సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఉపాసన థాకు తెలిపారు. పెట్రోలు బంకులు, ఎల్పీజీ చెల్లింపులను మొబిక్విక్ ద్వారా చేసే వినియోగదారులు ఈ ఆఫర్ ద్వారా ప్రయోజనం పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా దేశంలోని 20 ప్రముఖ నగరాల్లోని ఇండియన్ ఆయిల్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం బంకుల్లో మొబిక్విక్ ద్వారా చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్టు ఉపాసన వివరించారు. అలాగే ఇండేన్, భారత్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు కూడా మొబిక్విక్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని తెలిపారు.