: చిరంజీవిని సర్ ప్రైజ్ చేసిన రోజా!


ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవికి సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సర్ ప్రైజ్ నిచ్చింది. చిరంజీవి తన ప్రతిష్ఠాత్మక 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గతంలో ఎన్నడూ లేనంతగా టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తూ చిరంజీవి బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి టీవీ ఛానెల్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది.

ఇంటర్వ్యూ షూట్ కోసం కెమెరామెన్ అంతా సెట్ చేసిన తరువాత మేడ పైనుంచి కిందికి దిగిన చిరంజీవి తనను ఇంటర్వ్యూ చేసేది ఎవరు? అని అడిగారు. ఇంతలో రోజా తానేనంటూ ముందుకు వచ్చింది. అంతే.. చిరంజీవి ఆశ్చర్యపోయారు. 'అవునా? నిజమా? నువ్వేనా?' అంటూ తరచి అడిగారు. 'సర్ ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చా'నంటూ రోజా చెప్పడంతో ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆమెతో ముచ్చట్లలో పడ్డారు. కాగా, వీరిద్దరూ ముఠామేస్త్రీ, బిగ్ బాస్, ముగ్గురు మొనగాళ్లు వంటి సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News