: కోడి గుడ్డు ఎంతసేపు.. ఎలా.. ఉడుకుతుందో తెలుసా?
కోడి గుడ్డు ఎంతసేపు ఉడుకుతుందో తెలుసా? ఇది తెలుసుకోవడానికే జె.కెంజీ లోపెజ్ ఆల్ట్ అనే అమెరికన్ చెఫ్ కోడిగుడ్డుపై పరిశోధనలు చేశాడు. గుడ్డు ఎలా ఉడుకుతుంది? ఎంత ఉష్ణోగ్రతలో ఉడుకుతుంది? వంటి వివరాలన్నీ ఆయన నమోదు చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే... గుడ్డును ఉడకబెట్టడానికి 82 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. గుడ్డులో పచ్చసొన ఉడకడానికి 76 డిగ్రీల సెల్సియస్ చాలని ఆయన చెప్పారు.
గుడ్డును ఉడకబెట్టడం ప్రారంభించిన 1 నుంచి 3 నిమిషాల వరకు ఎలాంటి మార్పులు చోటుచేసుకోవని ఆయన అన్నారు. 5 నుంచి 7 నిమిషాల్లో గుడ్డులోని పచ్చసొన గట్టిబడుతుంది. కానీ తెల్లసొన ఇంకా ద్రవంగానే ఉంటుందని ఆయన తెలిపారు. ఆ తరువాత 9 నుంచి 11 నిమిషాల్లో పచ్చసొన బాగా ఉడుకుతుందని, నెమ్మదిగా తెల్లసొన కూడా గట్టిపడుతుందని ఆయన చెప్పారు. మొత్తానికి కోడి గుడ్డు ఉడకబెట్టడానికి 13 నిమిషాల సమయం పడుతుందని ఆయన చెప్పారు. పెద్దమంట మీద ఉడికిస్తే 9 నిమిషాలు పడుతుందని ఆయన తెలిపారు.