harish rawat: నో ప్రాబ్లం... ఎన్నికలకు నేను రెడీ: ఆసుపత్రి వద్ద ఉత్తరాఖండ్ సీఎం హరీశ్‌ రావత్‌

షార్ట్స్‌లో చూడండి
మార్చి 26న ఉత్తరాఖండ్‌లోని 70 స్థానాలకు ఒకే దశలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాను రెండు స్థానాల్లో పోటీ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి హరీశ్‌ రావత్ అనుకున్నారు. అయితే, ఆయ‌న ఈ రోజు ఉద‌యం అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో ఆసుప‌త్రిలో చేరారు. ఈ విష‌యంపై ఆయ‌న ఆసుప‌త్రి నుంచే స్పందించారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త‌న‌కు మెడ సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయ‌ని, సంపూర్ణ ఆరోగ్యంతో ఎన్నికలకు వెళతానని తెలిపారు. తాను ఫిట్‌గానే ఉన్నానని పేర్కొన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుమావ్‌, గర్వాల్‌ స్థానాల నుంచి బరిలోకి దిగాలని ఆయన చూస్తున్నారు. అయితే, చిన్న రాష్ట్ర‌మ‌యిన ఉత్తరాఖండ్‌లో ఒకే అభ్య‌ర్థి రెండు సీట్లలో పోటీ చేయడం స‌మంజసం కాదని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.
Go Back to Shorts
harish rawat

More Telugu News