: ప్రధాని కార్యాలయం, వైట్ హౌస్ ల మధ్య కొనసాగనున్న హాట్ లైన్
ఈ నెల 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నుంచి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో, భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు మాట్లాడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హాట్ లైన్ 20వ తేదీ తర్వాత కూడా కొనసాగనుంది. 2015లో ఈ హాట్ లైన్ ను ఏర్పాటు చేశారు. హాట్ లైన్ సదుపాయం ఇకపై కూడా కొనసాగుతుందని వైట్ హౌస్ అధికార ప్రతినిధి తెలిపారు.
గత ఏడాది ఈ హాట్ లైన్ ను ఏర్పాటు చేసిన తర్వాత మోదీ, ఒబామాలు తరచుగా పలు విషయాలపై చర్చించుకునేవారు. ఒకానొక సందర్భంగా ఇరువురు నేతలు గంటకు పైగా హాట్ లైన్ లో మాట్లాడుకున్నారని భారత్ లో అమెరికా రాయబారి తెలిపారు. అమెరికాతో హాట్ లైన్ సదుపాయం భారత్ తో పాటు మరో మూడు దేశాలకు (బ్రిటన్, రష్యా, చైనా) మాత్రమే ఉంది.