: ట్రంప్ తో భేటీ అయిన చైనా వ్యాపార దిగ్గజం
ఓవైపు చైనాతో కొనసాగే వాణిజ్యంపై అధిక పన్నులు వేస్తామంటూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ హెచ్చరికలు... మరోవైపు, తమతో వైరానికి దిగితే చూస్తూ ఊరుకోబోమంటూ చైనా వార్నింగ్. ఈ నేపథ్యంలో, డొనాల్డ్ ట్రంప్ ను చైనా ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా కలిశారు. వీరిద్దరి సమావేశం న్యూయార్క్ లోని ట్రంప్ టవర్ లో నిన్న జరిగింది. అమెరికాలో కొత్త ఉద్యోగాలను సృష్టించాలనే అంశంపై వీరిద్దరూ చర్చించారు. చైనాకు గూడ్స్ విక్రయించడానికి అమెరికాలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలను సృష్టించే ప్రణాళికపై చర్చ జరిగినట్టు అలీబాబా సంస్థ తెలిపింది.