: హైదరాబాద్‌లోని కత్రియా హోటల్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
హైదరాబాద్ సోమాజీగూడలోని హోటల్ కత్రియాలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్‌లోని నాలుగో అంతస్తులో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హోటల్ వద్దకు చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల విలువ చేసే ఫర్నిచర్ కాలి బూడిదైంది. అయితే ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.