: కిషన్ రెడ్డి అరెస్టు... కార్యకర్తలకు గాయాలు!


హైదరాబాదులోని గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బీజేపీ నేత కిషన్ రెడ్డి చేపట్టిన ఆందోళన రక్తమోడింది. హైదరాబాదులో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలసి జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం పెరగడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో బీజేపీ కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించారు. దీంతో పలువురు కార్యకర్తలు గాయాలపాలయ్యారు. అనంతరం కిషన్ రెడ్డిని అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

  • Loading...

More Telugu News