: సురేఖ నా డైటీషియన్... రామ్ చరణ్ నా ట్రైనర్!: చిరంజీవి
150వ సినిమాలో నటించాలని నిర్ణయం తీసుకున్న తరువాత ముందు శారీరకంగా సన్నద్ధం కావాలని నిర్ణయించామని ప్రముఖ నటుడు చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలో మేకోవర్ సాధించేందుకు చాలా కష్టపడ్డానని ఆయన తెలిపారు. మామూలుగా తాను మంచి భోజన ప్రియుడినని, అయితే నచ్చినదంతా తినకుండా సురేఖ జాగ్రత్తపడేదని, కొంచెం కూడా ఎక్కువ తిననిచ్చేవారు కాదని ఆయన చెప్పారు. అలాగే రామ్ చరణ్ తనకు ట్రైనర్ గా మారాడని ఆయన తెలిపారు. బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని భావించినా ఊరుకునేవాడు కాదని, తనను ఉత్సాహపరిచి, జిమ్ కు తీసుకెళ్లేవాడని, అలా వారిద్దరి సహకారంతో మేకోవర్ సాధించానని, తానీ సినిమాలో ఫిట్ గా కనిపించేందుకు వారిద్దరూ సహకరించారని చిరంజీవి వారిని అభినందించారు.