: ‘ఖైదీ నంబర్ 150’ లో రెండు క్యారెక్టర్లు పోషించాను!: చిరంజీవి


తనను చూస్తుంటే సగం సినిమా హిట్టయినట్టేనని దర్శకుడు వినాయక్ అన్నారని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఖైదీ నంబర్ 150’ షడ్రసోపేతమైన విందులాంటి  చిత్రమని, తన అభిమానులు కోరుకునేవి ఈ చిత్రంలో ఉంటాయని అన్నారు. ఈ చిత్ర నిర్మాతగా రామ్ చరణ్ బెస్ట్ టీమ్ ను సెలెక్ట్ చేసుకున్నాడని, చరణే తనకు ఎక్సర్ సైజ్ ట్రైనర్ అని, వినాయక్ వెరీ గుడ్ డైరెక్టర్ అని కితాబిచ్చారు.

వినాయక్ స్టామినా తనకు తెలుసని, దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ అందించాడని, డ్యాన్స్ మాస్టర్లు చాలా ఉత్సాహంగా కంపోజ్ చేశారని ఈ చిత్రంలో పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయని చెప్పారు. ‘ఖైదీ నంబర్ 150’ లో రెండు క్యారెక్టర్లు చేశానని చెప్పిన చిరంజీవి, ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో అభిమానులను చూసి సంతోషించానని, ఇన్నాళ్లూ అభిమానులను మిస్సయ్యానని అనిపించిందని అన్నారు.

  • Loading...

More Telugu News