: పంజాబ్ ఉపముఖ్యమంత్రిపైకి రాళ్లు విసిరిన దుండగులు
వచ్చేనెల 4న పంజాబ్‌లో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో మొదటిరోజు పాల్గొంటున్న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురయింది. జలాలాబాద్‌లోని గ్రామం నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా మోటారు సైకిళ్ల ర్యాలీని నిర్వహించిన ఆయనపైకి సుమారు 20 మంది దుండగులు రాళ్లు విసిరారు.
ఈ దాడిలో నలుగురు శిరోమణి అకాళీ దళ్(ఎస్‌ఏడీ) కార్యకర్తలకు గాయాలు కాగా, సుఖ్‌బీర్ సింగ్‌కు ఎటువంటి గాయం కాలేదు. కాగా, మరో పోలీసు వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో పోలీసులు 12 మంది అనుమానితులపై కేసులు నమోదు చేశారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే, తాము అదుపులోకి తీసుకున్న వారికి ఏ పార్టీతోను సంబంధాలు లేవని పోలీసుల తెలిపారు. మరోపక్క, ఈ దాడి చేసింది ఆమ్ ఆద్మీ పార్టీయేనని అకాళీ దళ్ ఆరోపిస్తోంది. తమ పార్టీపై అకాళీ దళ్ చేస్తోన్న ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.