: ఆడటం రాకపోతే ఇంట్లో కూర్చోండి... పర్యటనలకు ఎందుకొస్తారు?: పాక్ టీమ్ పై ఛాపెల్ అసంతృప్తి


ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా ఆడి, వైట్ వాష్ కు గురైన పాకిస్థాన్ జట్టుపై ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ ఛాపెల్ విమర్శలు గుప్పించాడు. ఆడటం రానప్పుడు, ఇంట్లోనే కూర్చోండి, విదేశీ పర్యటనలకు రావడం ఎందుకంటూ ప్రశ్నించాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు నాలుగుసార్లు పాకిస్థాన్ వైట్ వాష్ అయిందని అన్నాడు. పాక్ ఆటగాళ్ల బ్యాటింగే కాదు, ఫీల్డింగ్ కూడా పరమ చెత్తగా ఉందంటూ విమర్శించాడు. పాక్ కు సరైన నాయకుడు లేడని... మిస్బా నుంచి ఏ ఒక్క ఆటగాడు కూడా స్ఫూర్తి పొందినట్టు కనిపించడం లేదని అన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ లో సమూల మార్పులు అవసరమని తెలిపాడు. కనీస పోరాటం కూడా చేయలేని జట్టును పర్యటనలకు ఆహ్వానించడం మంచిది కాదంటూ ఆసీస్ బోర్డుకు సూచించాడు.

  • Loading...

More Telugu News