mulayam singh yadav: రాంగోపాల్ ను అనర్హుడిగా ప్రకటించండి.. రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీకి ములాయం లేఖ‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అధికార స‌మాజ్‌వాదీ పార్టీలో త‌లెత్తిన విభేదాలు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. త‌మ‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు, అఖిలేష్ మ‌ద్ద‌తుదారుడు రాంగోపాల్‌ యాదవ్‌ ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్న‌ట్లు పేర్కొన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ రోజు ములాయం మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ పార్టీ నుంచి రాంగోపాల్ యాద‌వ్‌ను బ‌హిష్క‌రించిన విష‌యాన్ని తెలియజేస్తూ, ఆయ‌న‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీకి ములాయం సింగ్ లేఖ‌ రాశారు. త‌మ‌పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న రాంగోపాల్ను తొలగించాల‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు.
mulayam singh yadav

More Telugu News