congress: పంజాబ్ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన మన్మోహన్ సింగ్
పంజాబ్ అసెంబ్లీకి వచ్చేనెల 4న ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పోటీ చేయనున్న అన్ని రాజకీయపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. పంజాబ్లో ఎన్నికల బరిలోకి దిగనున్న తమ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ రోజు తమ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. దీన్ని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.