: గూగుల్, యాపిల్ లకు రష్యా సీరియస్ వార్నింగ్!

ప్రపంచ టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ లకు రష్యా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. లింక్డ్ఇన్ సర్వీసులను వెంటనే తొలగించాలని గట్టి ఆదేశాలు జారీ చేసింది. రష్యాలోని గూగుల్, యాపిల్ ఆన్ లైన్ స్టోర్లలో లింక్డ్ఇన్ సర్వీసుల యాప్ ఉండకూడదంటూ హెచ్చరించింది. తమ దేశ పౌరుల డేటాను ఇంటర్నెట్ సంస్థలు నిల్వ ఉంచడం... తమ చట్టాలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. ఇటీవలే మైక్రోసాఫ్ట్ కు చెందిన లింక్డ్ఇన్ సర్వీసులను ఓ రష్యన్ కోర్టు బ్లాక్ చేసింది. రష్యా నుంచి ఆదేశాలు అందినట్టు యాపిల్ సంస్థ ధ్రువీకరించింది. మరోవైపు, రష్యా తీసుకున్న నిర్ణయం పట్ల లింక్డ్ఇన్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. రష్యాలో తమకు లక్షలాది మంది యూజర్లు ఉన్నారని తెలిపింది.

More Telugu News