: తమిళ సీఎం పన్నీర్ సెల్వం సరికొత్త రికార్డు.. గవర్నర్ కు బదులుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం!
ఈసారి తమిళనాడులో నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో సంప్రదాయానికి భిన్నమైన ఘటన జరగబోతోంది. గవర్నర్‌కు బదులు ఈసారి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. గణతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి పతాకావిష్కరణ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. తమిళనాడుకు ఇన్‌చార్జ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సీహెచ్ విద్యాసాగర్‌రావు ముంబైలో జరిగే వేడుకల్లో పాల్గొంటారని స్థానిక రాజ్‌భవన్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో గవర్నర్ ఆవిష్కరించాల్సిన జెండాను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున సెయింట్ జార్జ్ కోటపై ముఖ్యమంత్రి, మెరీనాబీచ్ గాంధీ విగ్రహం ప్రాంతంలో నిర్వహించే రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఆనవాయతీ. అయితే ఈసారి రాష్ట్రానికి గవర్నర్ రాలేకపోవడంతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మెరీనా బీచ్ వద్ద జరిగే వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.