: హైదరాబాద్ టు కరీంనగర్.. 'నగదు రహితం'పై అవగాహన కోసం తెలంగాణ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదీ సైకిల్ యాత్ర!
నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తెలంగాణ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది సైకిల్ యాత్ర చేపట్టారు. ఆదివారం తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్ నుంచి సైకిల్‌పై కరీంనగర్ యాత్రకు బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటలకు యాత్ర మొదలుపెట్టిన త్రివేది దారిపొడవునా నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు. 175 కిలోమీటర్లు ప్రయాణించి మధ్యాహ్నం మూడు గంటలకు కరీంనగర్ చేరుకున్నారు.