: గరుడ వాహనంపై దర్శనమిచ్చిన రామయ్య.. తరించిన భక్తజనం.. ఉత్తర ద్వారాన్ని దర్శించుకున్న కేసీఆర్ సతీమణి
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచల శ్రీరామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం వైభవంగా జరుగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి వారిని దర్శించుకుంటున్నారు. స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారి దివ్యస్వరూపాన్ని అశేష భక్తజనం దర్శించి తరించింది. కేసీఆర్ సతీమణి, కుటుంబ సభ్యులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.