: ‘ఓం నమో వేంకటేశాయ’ ఆడియో వేడుకకు హాజరైన అక్కినేని కుటుంబం


ప్రముఖ నటుడు నాగార్జున ప్రధాన పాత్రలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం ఆడియో వేడుక హైదారబాద్ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గీత రచయిత వేదవ్యాస మాట్లాడుతూ, ఈ చిత్రానికి పాటలు రాసే అవకాశం లభించడం తన అదృష్టమని అన్నారు. ఈ చిత్రంలోని పాటలను తాను రాయలేదని స్వామి వారే రాయించుకున్నారని, ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, అమల, యువ హీరోలు నాగ చైతన్య, అఖిల్, హీరోయిన్ అనుష్క, మాటల రచయిత భారవి తదితరులు హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News