: అమర్ సింగ్ కు ‘జెడ్’ కేటగిరి భద్రత.. కేంద్ర హోం శాఖ నిర్ణయం


సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఎస్పీ నేత ములాయం సింగ్ వర్గంలో సోదరుడు శివపాల్ యాదవ్, అమర్ సింగ్ తో పాటు కొందరు మాత్రమే నిలిచారు. సీఎం అఖిలేష్ యాదవ్ వర్గంలో ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, రెండొందల మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. అఖిలేష్ యాదవ్ వర్గం మొదటి నుంచి అమర్ సింగ్ ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమర్ సింగ్ కు బెదిరింపులు వస్తుండటంతో ఆయన భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ‘జెడ్’ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.  

  • Loading...

More Telugu News