: దమ్ముంటే చేస్తున్న ఆరోపణలు నిరూపించు: చంద్రబాబుకు కేవీపీ సవాల్


పోలవరం ప్రాజెక్టు విషయంలో తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖను రాస్తూ, దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలని, బహిరంగ చర్చకు సిద్ధపడాలని అన్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసిన కేవీపీ, ప్రాజెక్టును తాను అడ్డుకుంటున్నానని మంత్రులు, చోటా నేతలతో చెప్పిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు స్థితిగతులు, గతంలో ఖర్చు చేసిన నిధులపై ఎక్కడైనా చర్చించేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News