: రూ. 5కు 2జీ, రూ. 16కు 4జీ... గంటపాటు అన్ లిమిటెడ్ అంటున్న వోడాఫోన్


టెలికం సంస్థ వోడాఫోన్ తన కస్టమర్ల ముందుకు మరో ఆకర్షణీయ ఆఫర్ ను తీసుకువచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్లు రూ. 16 చెల్లించి గంటపాటు అపరిమిత 3జీ, 4జీ సేవలను అందుకోవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో రూ. 5 కే గంటపాటు అపరిమిత 2జీని, రూ. 7 కు అన్ లిమిటెడ్ కాల్స్ ను చేసుకోవచ్చని చెబుతూ 'సూపర్ అవర్' పేరిట ప్రత్యేక టారిఫ్ ను పరిచయం చేసింది. నామమాత్రపు ధరకు కావాల్సినంత డేటాను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ఈ ఆఫర్ తమ కస్టమర్లకు ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు వోడాఫోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సందీప్ కటారియా ఒక ప్రకటనలో వెల్లడించారు.

  • Loading...

More Telugu News