: రీమేక్ లు అందరూ చేశారు... అన్నయ్య చేస్తే తప్పేంటి?: నాగబాబు

అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఒక సినిమా చేస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నానని నాగబాబు తెలిపారు. హాయ్ లాండ్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, అన్నయ్య 150వ సినిమాగా రీమేక్ చెయ్యడమేంటి? అని చాలా మంది అన్నారని, అయితే రీమేక్ చేస్తే వచ్చే తప్పేంటో తనకు అర్ధం కాలేదని అన్నారు. సినిమా బాగుంటే స్ట్రెయిట్ సినిమానా? రీమేక్ సినిమానా? అన్నది ఎవరూ చూడరని నాగబాబు చెప్పారు. రీమేక్ సినిమాలను కల్యాణ్ బాబు, రామ్ చరణ్, ఇంకా చాలా మంది హీరోలు చేశారని, వారంతా చేస్తే లేని తప్పు అన్నయ్య చేస్తే ఏంటని ఆయన ప్రశ్నించారు. 

More Telugu News