: మన దేశంలో నగదురహితం సాధ్యమా?: షబ్బీర్ అలీ


గ్రామీణులు అధికంగా గల మన దేశంలో నగదు రహితం సాధ్యమా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ నిజామాబాద్‌ ధర్నా చౌక్‌లో కాంగ్రెస్‌ నేతలు నిర్వహించిన ఆందోళన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనాలోచితమని మండిపడ్డారు. దేశంలో ఆర్థికవేత్తలు సైతం నోట్లరద్దును వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.

నగదులేక నిత్యావసరాలకు దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ దేశంలో అయినా వందశాతం నగదు రహితం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రోజుకో నిర్ణయంతో ప్రజల్ని అయోమయానికి గురిచేశారని ఆయన ఆరోపించారు. నల్లకుబేరులెవరూ బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిల్చోలేదేని ఆరోపించిన ఆయన, పెద్దనోట్ల రద్దు సందర్భంగా ఆర్బీఐ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ప్రధాని నిర్ణయం ఆర్బీఐపై నమ్మకం కోల్పోయేలా చేసిందని ఆయన విమర్శించారు. 

  • Loading...

More Telugu News